ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సోమవారం సాయంత్రం పట్టణంలోని కృష్ణాపురం రోడ్డు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే అక్కడికక్కడే మాట్లాడి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.