'మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలి'
PPM: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్ది అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటి సమావేశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ యస్.వి.మాధవ్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది.