పెద్దవూర స్టేషన్‌‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

పెద్దవూర స్టేషన్‌‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

NLG: మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, క్రైమ్ రికార్డులు, ఉమెన్ హెల్ప్ డెస్క్, లాక్ అప్ తదితర విభాగాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదులపై జాప్యం చేయకుండా వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్ పాల్గొన్నారు.