'సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం'

SRD: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలో ఇసుక బజార్ మంగళవారం ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక అందించేందుకు బజారును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.