సొసైటీల బలోపేతానికి కృషిచేయాలి: ఎమ్మెల్యే

సొసైటీల బలోపేతానికి కృషిచేయాలి: ఎమ్మెల్యే

W.G: సొసైటీలు అందించే సేవలు రైతులకు ఉపయోగకరంగా ఉంటున్నాయని, వీటిని మరింత బలోపేతం చేసే దిశగా త్రిసభ్య కమిటీలు కృషిచేయాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో త్రిసభ్య కమిటీ సభ్యులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.