రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
MNCL: బెల్లంపల్లి- రేచిని రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని బల్వంత్ అనే వ్యక్తి మరణించాడు. రాజస్థాన్‌కు చెందిన మృతుడు తన భార్య బిందుతో కలిసి పత్తి ఎరడానికి 20 రోజుల క్రితం ఇక్కడకు వచ్చారు. సోమవారం రాత్రి బహిర్భూమికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఉదయం వెతకగా ట్రాక్ వద్ద మృతదేహం కనిపించింది. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ సంపత్ కేసు నమోదే చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.