మురళీ మోహన్‌కు పద్మశ్రీ రావడం అభినందనీయం: RRR
W.G: పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ ఉండటం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. తన ప్రియమిత్రుడు మురళీ మోహన్‌కు అత్యున్నత గౌరవ పురస్కారం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. కళాకారుడుగా, వ్యాపారవేత్తగా ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించిందన్నారు.