సర్పంచ్, వార్డు స్థానాలకు భారీగా నామినేషన్లు

సర్పంచ్, వార్డు స్థానాలకు భారీగా నామినేషన్లు

MNCL: లక్షెట్టిపేట మండలంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి భారీగా నామినేషన్లు నమోదు అయ్యాయని స్థానిక ఎంపీడీవో సరోజన తెలిపారు. మండలంలో మొత్తం 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలకు సంబంధించి 18 గ్రామాలకు కలిపి 103 సర్పంచ్ నామినేషన్లు, 576 వార్డు నామినేషన్లు దాఖలు అయ్యాయని ఆమె వెల్లడించారు. ఎన్నికల నియమాలు ప్రకారం నామినేషన్లు పరిశీలిస్తామని పేర్కొన్నారు.