ఎంఈఓ కార్యాలయం ముందు గ్రామస్తుల ధర్నా

ఎంఈఓ కార్యాలయం ముందు గ్రామస్తుల ధర్నా

RR: షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం ఎంఈఓ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి నేడు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. చెరుకుపల్లి ప్రాథమిక పాఠశాలలో 46 మంది విద్యార్థులు ఉండగా ఓ ఉపాధ్యాయురాలు బీరం చెరువు పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిందని మండిపడ్డారు. డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయురాలని తిరిగి పాఠశాలకు రప్పించాలని డిమాండ్ చేశారు.