కార్మికుల ఉపాధి కాపాడాలని జీఎంకి వినతి
PDPL: ఆర్టీ- 3 జీఎం కార్యాలయ బాయ్స్ టెండర్ కాలపరిమితి ముగియడంతో, కొత్త టెండర్ పిలవాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (IFTU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న జీఎంకి వినతిపత్రం అందజేశారు. 3 నెలల క్రితం పిలిచిన టెండర్‌కు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో, ఇప్పుడు వార్షిక టెండర్‌ను మళ్లీ పిలిచి కార్మికుల ఉపాధిని కొనసాగించాలన్నారు.