బాలల అశ్లీల కంటెంట్ చూస్తూ, షేర్ చేసిన ముగ్గురు అరెస్ట్
WGL: నగరంలో ఎన్‌సీఎంఈసీ నివేదికల ఆధారంగా చిన్న పిల్లల అశ్లీల చిత్రాలను చూసి, షేర్ చేసిన ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పోక్సో చట్టం సెక్షన్ 15, ఐటీ చట్టం సెక్షన్ 67B కింద కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు సాంకేతిక ఆధారాలతో వేగవంతమైన దర్యాప్తు జరిపి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.