గాలి వానతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం

మహబూబాబాద్: డోర్నకల్ మండలంలోని గొల్లచర్ల పరిధిలో హున్యతండా, రాముతండా, గోదాతండాలలో కొద్ది రోజుల క్రితం గాలి వాన బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్తి నష్టం జరిగిన పది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున బహుజనవాది డాక్టర్ వివేక్ అందజేశారు. బాధిత కుటుంబాలను కలిసి అండగా ఉంటామని భరోసా కల్పించారు.