రాయల చెరువుకు గండి.. ఆందోళనలో ప్రజలు
తిరుపతి: పాతపాలెంలో రాయల చెరువుకు గండిపడింది. దీంతో సమీప కాలనీలకు చెరువు నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 1000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ పెద్ద చెరువుకు గండి పడటంతో వందల ఎకరాల పొలాలు నీట మునిగిపోయాయని రైతులు, ప్రజలు విలపించారు. రాష్టంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.