మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు : ఎస్సై

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు : ఎస్సై

WGL: వర్ధన్నపేట మండలంలోని గ్రామాలలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని ఎస్సై రాజు సూచించారు. గురువారం పట్టణంలోని కోనా రెడ్డి చెరువు ప్రాంతంలో చేపలు పడుతున్న వారిని హెచ్చరించారు. భారీ వర్షాలకు వాగులు, చెక్ డ్యామ్‌లు పొంగిపొర్లుతున్న సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.