'కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి'
కృష్ణా: కంచికచర్ల మండలంలోని కీసరలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు ఆలయ ఛైర్మన్ ఎర్రగోర్ల రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానాన్ని విద్యుద్దీపాలతో అలంకరించినట్లు పేర్కొన్నారు. కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ కోరింది.