నర్సింగాపురంలో దొంగల చేతివాటం
JN: కొడకండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగాపురం గ్రామంలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన గోపాల్ దాసు సోమ నరసయ్య ఇంట్లో చొరబడి బీరువా పగలగొట్టి మూడు తులాల బంగారం (చెవి కమ్మలు, మాటీలు)తో పాటు 30 తులాల వెండిని దొంగిలించారు. ఈ ఘటనపై ఎస్సై రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.