VIDEO: పొన్న వాహనంపై వాడపల్లి వెంకన్న ఊరేగింపు

VIDEO: పొన్న వాహనంపై వాడపల్లి వెంకన్న ఊరేగింపు

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం రాత్రి స్వామివారు సమేతంగా ప్రత్యేక అలంకారంలో దర్శనం ఇచ్చారు. పొన్న వాహనాన్ని అధిరోహించి ఊరేగారు. అశేష భక్తజన సందోహం గోవింద నామస్మరణ గావిస్తూ ఉండగా భక్తులను అనుగ్రహిస్తూ స్వామి వారి వాహన సేవ ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది.