'మానేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

PDPL: మానేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ సూచించారు. మండలంలోని మిర్జంపేట, కిష్టంపేట, రాతుపల్లి తదితర గ్రామాల రైతులు, ప్రజలు, పశువుల కాపరులు, మత్స్యకారులు మానేరు వాగు వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం రెండు గేట్లు అధికారులు దిగువకు విడుదల చేయడంతో నీటి ప్రవాహం పెరుగుతుందన్నారు.