గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ
ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉ.6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్ ఈనెల 11వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. పోలింగ్ కు వారం రోజులే సమయం ఉండడం, బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు.