HYDలో కొత్తిమీరకు పెరిగిన డిమాండ్

RR: హైదరాబాద్‌లో కొత్తిమీరకు డిమాండ్ చాలా పెరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్తిమీర ఉత్పత్తి తగ్గడం, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవడంతో హోల్ సేల్ మార్కెట్లలో కట్ట విలువ రూ.30, బహిరంగ మార్కెట్లో రూ.35 నుంచి రూ. 40 వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 15 రోజుల వరకు ఇలాగే కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.