జిల్లా ప్రజలకు అలర్ట్
NZB: ఉమ్మడి జిల్లాలో ఈనెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతవరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 10°C ఉష్ణోగ్రతకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుందని.. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.