VIDEO: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం అంత ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో భక్తి, నిబద్ధతతో ఉపవాస దీక్షలు ఆచరించి ఆధ్యాత్మిక విలువలను చాటుకున్నారని, శాంతి, సౌహార్దత, సహనం మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించే ఈ పవిత్ర పండుగ సమాజంలో ఐక్యతను మరింత బలపరచాలని ఆకాంక్షించారు.