ALERT: 400 విమానాలు రద్దు

ALERT: 400 విమానాలు రద్దు

ఇండిగో విమానయాన సంస్థ 400కు పైగా విమానాలను రద్దు చేసింది. క్రూ సిబ్బంది (పైలట్లు) కొరత, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనల అమలులో ఉన్న ప్రణాళికా లోపాలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాల రద్దు పట్ల ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పింది.