బ్యాంకర్లతో పోలీసుల సమావేశం

ELR: చింతలపూడి పోలీస్ సర్కిల్ కార్యక్రమంలో గురువారం పలు బ్యాంక్ మేనేజర్లతో పోలీసులు సమావేశం నిర్వహించారు. సీఐ క్రాంతి కుమార్, ఎస్సై సతీష్ కుమార్‌లు మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటూ జరుగుతున్న ఫిషింగ్, వోయిస్ ఫిషింగ్, ఫేక్ యాప్ లింకుల ద్వారా డబ్బుల మోసం వంటి నేరాలపై అవగాహన కల్పించారు. OTPలు, ఖాతా వివరాలు ఎవరితోనూ పంచుకాకుండా చూడాలన్నారు.