ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్
NZB: ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఈ నెల 15న కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్ పర్సన్ జీవీఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆమె ఛాంబర్‌లో కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.