VIDEO: యాదగిరిగుట్టలో దంచి కొట్టిన వర్షం

BHNG: యాదగిరిగుట్ట మండలంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.