VIDEO: వైభవంగా ముగిసిన సీతారాముల బ్రహ్మోత్సవాలు
HNK: కమలాపూర్ మండలకేంద్రంలో సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ముగిశాయి. గత నెల 23న ప్రారంభమైన ఉత్సవాల్లో 27న సీతారాముల కళ్యాణం నిర్వహించగా, ప్రతిరోజు చిన్న రథంపై ఊరేగింపులు చేపట్టారు. ఈ నెల 1న బండ్ల జాతర నిర్వహించి, ఆదివారం పెద్ద రథోత్సవం,నాగవెల్లి, పవళింపు సేవలతో కార్యక్రమాలు ముగిశాయి.