VIDEO: గ్యాస్ కోసం వినియోగదారుల కష్టాలు

VIDEO: గ్యాస్ కోసం వినియోగదారుల కష్టాలు

NTR: కంచికచర్లలో జుజ్జూరు రోడ్డులో ఉన్న గ్యాస్ ఏజెన్సీ వద్ద సిలిండర్ల సరఫరా లోపంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచే భారీ క్యూ కనిపిస్తుండగా, సిలిండర్లు సమయానికి అందకపోవడంతో ఎప్పుడు ఇస్తారో తెలియక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమాచారంలేక గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.