ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు: సీపీ
NZB: జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు CP సాయి చైతన్య తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాల్లో ఉ.9 గంటల నుంచి మ. 12 గంటల వరకు, అలాగే మ. 2:30 గంటల నుంచి సా. 5:30 వరకు పరీక్షలు కొనసాగనున్నట్లు సీపీ వెల్లడించారు.