కేంద్ర అధికారులతో పయ్యావుల కేశవ్ భేటీ
ATP: మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యయ విభాగం అదనపు కార్యదర్శి సజ్జన్ సింగ్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించిన నిధుల విడుదలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.