VIDEO: రోడ్డుపై చేరిన ఖాళీ మందు సీసాలు.. ప్రజలకు ఇబ్బందులు
MNCL: బెల్లంపల్లి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి బెల్లంపల్లి బస్తిలోని స్క్రాప్ దుకాణం రేకులు ఎగిరిపోయాయి. దీంతో గురువారం ఉదయం దుకాణంలోని ఖాళీ మందు సీసాలు మొత్తం రోడ్డు పైకి వచ్చి పడ్డాయి. దీంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. కళాశాల పక్కనే స్క్రాప్ దుకాణం నిర్వహించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బస్తీ ప్రజలు వాపోయారు.