టిక్కెట్ కోసం రాయనిగూడెం నేతల ధర్నా

టిక్కెట్ కోసం రాయనిగూడెం నేతల ధర్నా

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నిరసనలతో హోరెత్తింది. 11వ వార్డు (రాయనిగూడెం) కౌన్సిలర్ టిక్కెట్‌ను ఎల్గూరి ఇందిరకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు.