పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
NTR: విజయవాడలోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు. విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, విద్యుత్, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలపై అధికారులు తీసుకున్న చర్యలను ఆయన సమీక్షించారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులకు సూచించారు.