కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే
AKP: రాంబిల్లి మండలం మామిడివాడ గ్రామంలో కమ్యూనిటీ హాల్, పైడితల్లి అమ్మవారి కళామందిరాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఇవాళ ప్రారంభించారు. నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధికి కంపెనీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.