ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలులోని కొప్పోలు నుంచి కొత్తపట్నం వరకు స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ రావు ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ బుధవారం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా రైతులకు రూ. 7 వేలు అందించారని, ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు.