19 మద్యం సీసాలు స్వాధీనం: ఎస్సై
KDP: అట్లూరు (M) మాడమూరు ఎస్సీ కాలనీలో ఒక దుకాణంలో 19 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాగ కీర్తన తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు వెళ్లి తనిఖీలు చేయగా.. ఈ మద్యం సీసాలు లభ్యమయ్యాయని ఎస్సై అన్నారు. పెంచల్ రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బెల్ట్ షాపులు ఎవరైనా నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.