ఎన్నికల పరిశీలకునిగా మంత్రి
KNR: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పుదుచ్చేరికి స్టార్ క్యాంపెయినర్, ఎన్నికల పరిశీలకునిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఏఐసీసీ నియమించింది. నేటి నుంచి మూడు రోజులు ఆయన పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొని, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ, పార్టీ విజయానికి కృషి చేయనున్నారు. ఆయన వెంట జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు కూడా ప్రచారానికి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.