గిరిజన విద్యార్థులకు ప్రవేశాలు

KNR: బెస్ట్ అవైలబుల్ స్కూల్ 2025-26 సంవత్సరానికి 3, 5, 8 తరగతుల్లో గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను జూన్ 9 నుంచి జూన్ 17లోగా జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ కరీంనగర్ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. జూన్ 20న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.