వరద పొంగుతుండడంతో పోలీసుల బందోబస్తు

RR: షాద్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నందిగామ మండల కేంద్రం నుంచి అప్పారెడ్డిగూడ గ్రామానికి వెళ్లే రహదారిలో వరద పొంగుతుంది. దీంతో అప్పారెడ్డిగూడ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.