108 వాహనంలో మహిళ ప్రసవం

108 వాహనంలో మహిళ ప్రసవం

MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్టే గ్రామానికి చెందిన ఫాతిమా బేగంకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు108 వాహనం ద్వారా తొరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువగా కావడంతో ఈఎంటి వనజ, పైలెట్ మహేందర్ చాకచక్యంగా పురుడు పోశారు. దీంతో ఫాతిమా బేగం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.