విద్యా శాఖ అధికారులను అభినందించిన కలెక్టర్

SRD: పదవ తరగతిలో జిల్లా ద్వితీయ స్థానం సాధించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ప్రత్యేకంగా అభినందించారు. అత్యధిక మార్కులు సాధించిన చర్యాల పాఠశాల విద్యార్థులు కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి లింబాజి, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, సీఎంఓ వెంకటేశం పాల్గొన్నారు.