జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు

జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు

NRML: శాంతి భద్రతల దృష్ట్యా నిర్మల్ జిల్లాలో ఆగస్టు 31 వరకు 30 పోలీస్ యాక్ట్ 1861 అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదివారం ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్ సభలు, ఊరేగింపులు, ధర్నాలు, నిషేధిత ఆయుధాల వినియోగం, రాళ్లు జమ చేయడం, లౌడ్ స్పీకర్లు, డీజేలు నిషేధం అన్నారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.