దామెరలో ఘనంగా అంబేద్కర్ జయంతి
HNK: దామెరలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ కొత్తగూడెం ఇంఛార్జి విజయ్ చందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాజకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. అనంతరం పిల్లలకు నేతలు పండ్లను పంపిణీ చేశారు.