కారును ఢీకొట్టిన లారీ.. యువకుడి మృతి
TPT: పుత్తూరు (M) పిల్లారిపట్టు క్రాస్ రోడ్డు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి పుత్తూరు వైపు వస్తున్న లారీ, అదే దిశలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు రోడ్డు పక్కన ఉన్న రోలింగ్, కల్వర్టును ఢీకొని కాలువలో పడిపోయింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా డ్రైవర్ ఎం. ధర్మ తేజ (22) అక్కడికక్కడే మరణించాడు. మిగతవారికి తీవ్ర గాలయ్యాయి.