మోపిదేవి క్షేత్రం దర్శించుకున్న ఆడిట్ సబ్ డైరెక్టర్

మోపిదేవి క్షేత్రం దర్శించుకున్న ఆడిట్ సబ్ డైరెక్టర్

కృష్ణా: మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏలూరు ఆడిట్ విభాగం ప్రాంతీయ ఉప సంచాలకులు బి.ఆర్.క్రాంతి కుమారి దర్శించుకున్నారు. ఈ మేరకు దేవస్థానానికి విచ్చేసిన క్రాంతి కుమారికి ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదనరావు ఆధ్వర్యంలో, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.