15 నెలల్లో రూ.10,644 కోట్ల పెట్టుబడులు: కందుల

AP: పర్యాటక రంగానికి పెట్టుబడులు సాధించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 15 నెలల్లో రూ.10,644 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని వెల్లడించారు. పర్యాటక అభివృద్ధి రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ నిలవాలనేదే తమ లక్ష్యమన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను కోకో హబ్బుగా తయారు చేస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి రోజాకు లేదని విమర్శించారు.