సీతారామచంద్రుని సేవలో కేంద్ర మంత్రి బండి సంజయ్

సీతారామచంద్రుని సేవలో కేంద్ర మంత్రి బండి సంజయ్

KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి రథోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు కార్యకర్తలు, ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులతో కలిసి రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి.