నిర్భయంగా రండి.. న్యాయం పొందండి: ఎస్పీ
SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో ‘పోలీస్ ప్రజావాణి’ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేస్తూ దిశానిర్దేశం చేశారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు పొందాలని సూచించారు.