రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: మంత్రి

రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: మంత్రి

HYD: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు నిరంతర సరఫరా ఉండేలా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.