ఎనకండ్ల గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
NDL: బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో శుక్రవారం నాడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. వైసీపీ నాయకుడు బొబ్బల రాజశేఖర్ రెడ్డి తల్లి బొబ్బల రాజమ్మ అకస్మాత్తుగా మృతి చెందింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కాటసాని రామిరెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.